దర్శకుడికి సోనూ సాయం..

41
sonu

రియల్ హీరో సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సోనూ…తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్‌కు సాయం అందించారు.

మెహ‌ర్ ర‌మేష్ త‌న స‌న్నిహితుల కోసం కొన్ని మందులు, ఇంజక్షన్‌ల కోసం చాలా ప్ర‌య‌త్నించార‌ట‌. అవి ఎక్కడా దొరకలేదని, ఇక నువ్వే దిక్కని సోనూ సూద్‌ను మెహర్ రమేష్ వేడుకున్నారు.

మెహ‌ర్ ర‌మేష్ ట్వీట్‌పై స్పందించిన సోనూ సూద్.. సోద‌రా, నువ్వు అడిగిన ప్ర‌తి మందు, ఇంజ‌క్ష‌న్ వ‌చ్చేస్తుంది. ప్రాణాన్ని కాపాడుదాం అంటూ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. అన్ని మందుల‌ను స‌రైన స‌మ‌యంలో పంపారు. సోనూ సూద్ ఫౌండేష‌న్ అద్భుతంగా ప‌ని చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అని పేర్కొన్నారు.