సూర్యగ్రహణం..దేవాలయాలు బంద్

183
ttd
- Advertisement -

ఇవాళ సూర్యగ్రహణం సందర్భంగా దేవాలయాలు బంద్ కానున్నాయి. 27 ఏండ్ల పాక్షిక గ్రహణం ఏర్పడనుండటంతో దేవాలయాలు బంద్ కానున్నాయి. ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాలను మూసివేయనున్నారు.

ఈ సమయంలో అన్ని రకాల దర్శనాలు రద్దు చేశారు. లడ్డూ విక్రయం, అన్నప్రసాద వితరణ కూడా రద్దు చేశారు. రేపు దర్శనాలు లేనందున నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించరు. గ్రహణ ఘడియలు ముగిసిన తర్వాత ఆలయం తలుపులు తిరిగి తెరవనున్నారు. ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే కక్ష్యలో లేనప్పుడు.. సూర్యుడి ఉపరితలంలో కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్య గ్రహణంగా పేర్కొంటారు. పాక్షిక సూర్య గ్రహణంలో ఆరంభం, గరిష్ఠం, ముగింపు అని మూడు భాగాలు ఉంటాయి. ఆరంభంలో చంద్రుడు సూర్యుడి డిస్క్ లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలో అధిక భాగాన్ని కప్పేస్తాడు. ఆ తర్వాత క్రమంగా పక్కకు జరుగుతాడు.

- Advertisement -