ఈ ఏడాది ఆఖరి సూర్య గ్రహణం..

140
solar eclipse
- Advertisement -

ఈ ఏడాది (2020) చివరి సూర్యగ్రహణం ఈరోజు (డిసెంబరు 14)న సంభవించనుంది. జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వృశ్చిక, మిధున రాశుల్లో ఈ గ్రహణం సంభవించనుంది. సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు మొదలయ్యే గ్రహణం రాత్రి 12.23 గంటల వరకూ ఉంటుందని పండితులు వెల్లడించారు. అయితే, ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. గ్రహణం కనిపించని చోట దాని ప్రభావం ఉండబోదని పండితులు తెలిపారు.

ఇక ఈ గ్రహణం అంటార్కిటికా, అట్లాంటిక్, దక్షిణ అమెరికా, దక్షిణా ఆఫ్రికా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. దీని తరువాత వచ్చే సంవత్సరం తొలి సూర్య గ్రహణం జూన్ 10న ఏర్పడనుంది. ఇది ఇండియాలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. ఆపై డిసెంబర్ 4న మరో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది అంటార్కిటికా, దక్షిణ ఆఫ్రికా, అట్లాంటిక్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలలో కనిపించనుంది.

- Advertisement -