బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్‌..ఏకగ్రీవం

354
rishi
- Advertisement -

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాగే ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడు రిషి సునాక్(42). పెన్నీ మోర్డాన్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో రిషి సునాక్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.

యూకే మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో.. గత ఎన్నికల్లో రన్నరప్‌గా నిలిచిన రిషి సునాక్‌ ఇప్పుడు ముందంజలోకి వచ్చారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఐక్యతను కాపాడటం కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, అయినా తన పునరాగమనానికి ఇది సరైన సమయం కాదని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు.

యూకే ప్రధాని పదవికి పోటీపడాలంటే ముందుగా పార్టీకి చెందిన 100 మంది ఎంపీల మద్దతు కావాలి. రిషి సునాక్‌కు 142 మంది ఎంపీల మద్దతు ఉండగా పెన్నీ మార్డౌంట్‌కు కేవలం 29 మంది ఎంపీల మద్దతు ఉండటంతో ఆమె పోటీనుండి తప్పుకున్నారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే రిషి ప్రధానిగా ఎన్నికయ్యారు.

- Advertisement -