హీరోయిన్లు సహకరించడం లేదు..

240
- Advertisement -

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ‌వైభంగా క‌ర్టైన్ రైజ‌ర్ వేడుక జ‌రిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మా అధ్యక్షుడు శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాలకు వచ్చి కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న హీరోయిన్లు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు బతిమాలినా రావడం లేదని, తాము చేపట్టే ఏ మంచి పనికీ సహకరించడం లేదని మండిపడ్డాడు. తాము బతిమాలుతుంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే కోఆపరేట్ చేస్తున్నారని చెప్పిన ఆయన, వారి మేనేజర్లు కూడా అలాగే ఉన్నారని అన్నాడు. నిర్మాతలు ఇచ్చిన ఏదైనా చెక్కులు బౌన్స్ అయితేనే సభ్యత్వం కోసం తమ వద్దకు పరిగెత్తుకు వస్తున్నారని ఆయన ఆరోపించాడు. హీరోయిన్లు తోకలు జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తామని హెచ్చరించాడు. మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇచ్చేంత డబ్బు ఇవ్వలేకపోయినా, తాము కూడా ఎంతో కొంత ఇస్తామని ‘మా’ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరాడు.

Sivaji Raja about Heroines

ఏప్రిల్ 28న అమెరికా డ‌ల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌వుతున్న‌ట్లు శివాజీ రాజా తెలిపారు. ఈవెంట్‌ను ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్- తిరుమ‌ల ప్రొడ‌క్ష‌క‌న్స్ ప్రైవెట్ లిమిటెడ్ సంయుక్త‌గా అమెరికాలో నిర్వ‌హిస్తున్నాయి.

`చిరంజీవిగారికి `మా` వేడుక‌లు గురించి చెప్ప‌గానే వెంట‌నే ఒప్పు కున్నారు. ఎక్క‌డికి రావడానికైనా సిద్దంగా ఉన్నాన‌ని హామీ ఇచ్చారు. అలాగే మ‌హేష్ బాబు గారు కూడా మేలో జ‌రిగే ఓ ఈవెంట్‌కు వ‌స్తాన‌న్నారు. వీరిద్ద‌రూ మాకు ఎంతో స‌హాకారాన్ని అందిస్తున్నారు. అలాగే బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, వెంక‌టేష్, నాగార్జున కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. `మా` కోసం ఎత‌క‌ష్ట‌మైనా ప‌డ‌టానికి నేను..మాటీమ్ సిద్దంగా ఉన్నాం…. అన్నారు.

- Advertisement -