ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం!

30
- Advertisement -

ఎండు ద్రాక్ష గురించి అందరికీ తెలిసిందే. స్వీట్ల తయారీలోనూ పిండి వంటలలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాలామంది వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే డాక్టర్లు కూడా వీటిని తినమని సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా ఎండు ద్రాక్ష తినడం మహిళలకు ఎంతో మేలు. మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించడంలో ఎండు ద్రాక్ష ఎంతగానో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది మహిళలకు ఐరన్ లోపంతో బాధ పడుతుంటారు. అలాంటివారు ప్రతి రోజూ ఆహార డైట్ లో ఎండు ద్రాక్ష చేర్చుకుంటే ఐరన్ లోపాన్ని త్వరగా జయించవచ్చట. ఇంకా కొందరు మహిళలు బరువు తగ్గెందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు..

అలాంటి వారు నిత్యం ఎండుద్రాక్ష తింటే ఊబకాయం నుంచి బయటపడవచ్చు. కేవలం మహిళలకు మాత్రమే కాకుండా పురుషుల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మధుమేహంతో బాధపడే వారు నిత్యం ఎండుద్రాక్ష తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయట. ఇంకా గుండె సమస్యలను దూరం చేయడంలో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమర్థవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం అన్నీ రకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా తక్షణ శక్తినివ్వడంలో కూడా ఎండు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎండుద్రాక్షను ప్రతిరోజూ ఆహార డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు క్రమం తప్పకుండా వీటిని తినడం అలవాటు చేసుకుంటే ఎంతో మేలు.

Also Read:సీఏఏతో శాంతి భద్రతల సమస్య:కేజ్రీ

- Advertisement -