“మీటూ” అంటున్న మరో సింగర్..!

271
- Advertisement -

దేశ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. లైగింక వేధింపుల గురించి ఒక్కొక్క బాధిత మహిళలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నారు. అయితే తాజాగా.. ప్రముఖ గాయని సునీత సారథి తన జీవితంలో జరిగిన సంఘటనలు వివరిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. చిన్నప్పటి నుంచే లైంగిక దాడులు జరుగుతున్నాయని.. తన పోస్ట్ వల్ల కొందరు మహిళలకు దైర్యం వస్తుందని ఈ విషయాలు షేర్ చేస్తున్నానని తెలిపింది.

తనకు ఐదేళ్లు ఉన్నప్పుడు వరుసకు మామ అయ్యే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. తనను ప్రేమగా చూసుకుంటున్నాడని అందరు భావించేవారని.. కానీ కొన్నేళ్ల తర్వాత ఆయన వికృత చేష్టలు అర్థం చేసుకుని నిబ్బరపోయానని తెలిపింది. ఆ తర్వాత తమ అమ్మ సహోద్యోగి కూడా తనను వేధించేవాడని.. తనను ఎత్తుకుని ఆడించినట్టు చేస్తూ వికృత చేష్టలు చేసేవాడని చెప్పుకొచ్చింది.

అతనిని తాను ఎంతగానో అసహ్యించుకున్నప్పటికీ.. ఓ రోజు వాళ్ల ఇంటికి వచ్చి లిప్ లాక్ ఇచ్చాడని చెప్పింది. తనను వదిలించుకునేందుకు ప్రయత్నించగా ముఖంపై ముద్దులు పెడుతూ రాక్షసానందం పొందాడని ఆవేదన వ్యక్తం చేసింది.

గాయని చిన్మయి తనకు స్నేహితురాలు కాకపోయినా.. ఆమె జీవితంలో చేదు ఘటన ఎలా జరిగాయో.. తనకు కూడా అలాగే జరిగాయన్నది. మహిళలు కలిసి ముందడుగు వేయాల్సిన సమయం వచ్చిందని.. మీటూ వల్ల తన బాధను పంచుకునే అవకాశం లభించిందని ట్వీట్ చేసింది. నిజాన్ని నిర్భయంగా చెబుతూ వెకిలి చేష్టలు చేసేవాళ్లకు కఠిన శిక్ష పడేలా ఆలోచనలు చేయాలని.. మగవాళ్లు కూడా తమకు మద్దతు తెలిపితే నీచులకు శిక్ష పడేలా చేయవచ్చు అని సునితా సారథి పోస్ట్ చేసింది.

- Advertisement -