జనవరి 9న రామ్‌తో పెళ్లి : సునీత

60
sunitha

జనవరి 9న రామ్ వీరపనేనితో తన పెళ్లి జరగనుందని సింగర్ సునీత తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన సునీత…వచ్చే నెల 9వ తేదీన నా వివాహాం జరగనుందని తెలిపింది. కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించా… కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా శ్రీవారి దర్శనానికి దూరమయ్యా… ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా వుంది అని సునీత తెలిపింది.

కరోనా నేపథ్యంలో కొంతమంది ప్రముఖులను మాత్రమే వీరి వివాహానికి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇటీవలె రామ్‌తో సునీత ఎంగేజ్‌మెంట్ జరుగగా ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.