మళ్లీ కరోనా కలకలం!

67
- Advertisement -

కరోనా ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంచి చనిపోగా ఇప్పుడు మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. సింగపూర్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

గత వారం రోజుల్లోనే కొవిడ్ కేసులు 75 శాతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 19 నుంచి రోజువారీ కొవిడ్‌ అప్‌డేట్స్‌ను విడుదల చేయాలని సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరని సూచించింది.

సింగపూర్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య రోజుకు సగటున 225-350 వరకు ఉంటుంది. ఇ చాలా మందిలో కరోనా జేఎన్‌.1 బారినపడ్డట్లు తెలియగా కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే ఈ వేరియంట్‌ ఎక్కువగా వేగంగా వ్యాపించదని తెలుస్తోంది.

Also Read:Harishrao:ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన కాంగ్రెస్

- Advertisement -