తమిళ హీరో శివకార్తికేయన్, సమంత, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా తమిళంలో ప్రముఖ నిర్మాత ఆర్.డి.రాజా 24ఏమ్ స్టూడియెస్ బ్యానర్‌లో నిర్మించిన చిత్రం సీమరాజా.. ఈ చిత్రం తమిళంలో విడుదలయ్యి కమర్షియల్‌గా చాలా మంచి సక్సస్‌ను అందుకుంది. ఈ మూవీలో లేడీ విలన్‌గా సిమ్రన్ నటించింది. ఈ చిత్రానికి పొన్రమ్ దర్శకుడు.
ఈ చిత్రాన్ని గతంలో చాలా చిత్రాలు డిస్ట్రిబ్యూషన్, నిర్మాణం చేసిన ప్రముఖ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల సాయికృష్ణా ఫిలింస్ ద్వారా తెలుగులో అనువాదం చేశారు. లక్ష్మి పెండ్యాల సమర్పిస్తున్న ఈ సీమరాజాను ఫిబ్రవరి 8న తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..” శివకార్తికేయన్ .. సమంత .. కీర్తి సురేశ్ పాత్రలు సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇక సిమ్రన్ పండించే విలనిజం తెరపై చూసితీరవలసిందే. ‘ఒరేయ్ నేను చీరకట్టిన మగాడినిరా’ అంటూ ఆమె డైలాగ్ వుంటుందంటే ఆ విలనిజం ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి సిమ్రన్ పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. ఎక్కడా తమిళ చాయలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాము.