ఫిబ్రవరి 15న …’4 లెటర్స్‌’

218
4 Letters
- Advertisement -

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా తెరకెక్కుతున్న చిత్రం `4 లెట‌ర్స్‌`. కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే అన్నది ఉప శీర్షికతో వస్తున్న ఈ చిత్రంతో ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకురానుంది.

నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ “మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ సినిమా ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌ వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారని తెలిపారు.

హీరో ఈశ్వర్ మాట్లాడుతూ ఎంతోమంది టాప్ స్టార్స్‌ను వెండితెరకు పరిచయం చేసిన గ్రేట్ డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర రావు నా తొలి చిత్రం టీజర్‌ను విడుదల చేయటం, నన్ను ఆశీర్వదించటం సంతోషంగా ఉంది. ఆయన హస్తవాసి మంచిదని ఎంతో మంది అంటూ ఉంటారు. నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు సినిమాను తెర‌కెక్కించానని దర్శకుడు తెలిపారు. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగిందన్నారు.

ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. సాంకేతిక నిపుణులు: కో డైరెక్ట‌ర్‌: రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: సి.భాస్క‌ర్ రాజు,
పాట‌లు: సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: వ‌ర్మ‌, మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌ఫీ: చిట్టిబాబు.కె,నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్, క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్.

- Advertisement -