స్పూన్‌తో మీ ఆరోగ్యాన్ని చెక్‌ చేసుకోండిలా..

57
- Advertisement -

ఆరోగ్యం విషయంలో నిరంతర పరిశీలన ఎంతో అవసరం. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చినా..వైద్యుడి వద్దకు వెళ్ళేందుకు ఆసక్తిచూపించరు. కొన్ని సందర్భాల్లో శరీరం సూచించే సంకేతాలను అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యకు దారితీస్తుంది. ఈ చిన్న స్పూన్ టెస్ట్‌తో మీ ఆరోగ్యం స్థితిని సులభంగా తెలసుకోవచ్చు. నిమిషం వ్యవధిలోనే మీరు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అనే విషయం తెలుసుకోండి. అయితే ఇది పరగడుపున మాత్రమే చేయాలి. మంచి నీళ్లు కూడా తాగకుండా పరక్షించుకోవాలి.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని దానితో నాలుకపై రుద్దాలి. ఇలా చేసినప్పుడు నాలుకమీద లాలాజలం దానికి అంటుంది. తర్వాత స్పూన్‌ను ఓ ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఎండలో పెట్టాలి. నిమిషం తర్వాత కవరులోని స్పూన్‌ ఉపరితలం తాకకుండా బయటకు తీయాలి.

ఆ చెంచాలో ఎలాంటి మచ్చలు లేనట్లైతే మీ అంతర్గత అవయవాలు ఆరోగ్యం ఉన్నట్లే. ఒకవేళ ఏవైనా మచ్చలు ఏర్పడితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు భావించాలి. శ్వాసించేటప్పుడు దీని వాసన కూడా భరించలేనంతగా ఉంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కు సూచన. ఈ చెంచా నుంచి అమ్మోనియా వాసన వెలువడితే మూత్రపిండాల్లో లోపానికి సంకేతం.

పండ్ల వాసన వస్తే చక్కెర వ్యాధితో సతమతమవుతున్నట్లే. లాలజలంలోని కీటోన్లు తియ్యటి వాసన వచ్చేలా చేస్తాయి.

తెల్ల మచ్చలు ఉంటే శ్వాసకోశ వ్యాధులకు సంకేతం. ఈ తెల్ల మచ్చలకు శరీరానికి చెందిన అనేక అంటు వ్యాధులు, వైరస్‌లతో సంబంధం ఉంటుంది.

చెంచాపై మచ్చలు ఊదా రంగులో ఉంటే తక్కువ రక్త ప్రసరణ, బ్రాంకైటీస్, కొవ్వు అధిక పరిమాణంలో ఉన్నట్లు భావించాలి. బ్రాంకైటీస్ వల్ల రక్త ప్రసరణకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాను తగ్గడంతో ఉదారంగులోకి మారుతుంది.

పసుపు మచ్చలు ఏర్పడితే థైరాయిడ్‌కు సూచన. థైరాయిడ్ సమస్య ఉంటే ఈ మచ్చలు మందంగా ఏర్పడతాయి. బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారడం అనేది థైరాయిడ్ గ్రంథిపై ఆధారపడి ఉంటుంది. ఇది సక్రమంగా లేనప్పుడు పసుపుపచ్చ రంగులో మందమైన మచ్చలు ఏర్పడతాయి.

నారింజ రంగులో మచ్చలు ఏర్పడితే మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నట్లే. దీర్ఘకాలికమైన కిడ్నీ వ్యాధి నోటి కణజాలాల వల్ల కలుగుతుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -