Simhadri:వావ్.. రీరిలీజ్‌ లోనూ హౌస్‌ ఫుల్ బోర్డ్స్

74
- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘సింహాద్రి’ మూవీ మే 20న రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా వెయ్యి థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఐతే, గ‌తంలో ఏ సినిమా రీరిలీజ్‌కు కూడా జ‌రగ‌ని ప్లానింగ్స్‌తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందుకే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో స‌హా ఇత‌ర అన్ని ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంట‌నే హౌస్‌ ఫుల్ బోర్డ్స్ ప‌డిపోతున్నాయి. చూస్తుంటే ఈ సినిమా రీరిలీజ్ మూవీస్‌ లో రికార్డు సృష్టిస్తుందేమో అనిపిస్తుంది.

కాగా ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లను ఓ మంచి పని కోసం ఉపయోగిస్తున్నారని టాక్. పేదరికంతో బాధపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ కలెక్షన్లను పంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ సూచించిన అభిమానులకు ఈ సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘RRR’ సినిమాతో గ్లోబర్ స్టార్‌గా మారిపోయిన జూ.ఎన్టీఆర్ రేంజ్ ను సింహాద్రి రీరిలీజ్ కలెక్షన్స్ ఘనంగా చాటి చెబుతాయి అని తారక్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read:BRS: బి‌ఆర్‌ఎస్ కు ‘నో పోటీ’!

ఇక ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివ కాంబోలో రాబోతున్న ‘ఎన్టీఆర్‌ 30’పై మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రేపు సాయంత్రం 7:02 గంటలకు ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను లాంఛ్ చేయనున్నారు.ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందట. కాగా, ఈ పాన్ ఇండియా సినిమాలో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read:హ్యాపీ బర్త్ డే..నవాజుద్దీన్ సిద్ధిఖీ

- Advertisement -