త్రిష‌-శింబు ప్రేమాయణం.. త్వరలో పెళ్లి..?

105
Trisha

కోలీవుడ్ రొమాంటిక్ హీరో శింబుతో త్రిష ప్రేమలో మునిగి తేలుతోందనీ, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనీ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరి నుంచీ మాత్రం ఇంతవరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.. అయితే ఇటీవల శింబు ఈ ఏడాది డిసెంబర్‌లో శుభవార్త చెబుతానంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, తొందరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అది రియల్‌ లైఫ్‌ లేక రీల్‌ లైఫ్‌కు చెందిన విషయమా అని శింబు క్లారిటీ ఇవ్వలేదు.

మ‌రోవైపు తాజాగా శింబు తండ్రి రాజేంద‌ర్ ఈ ఏడాది త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడాడు.ఈ క్ర‌మంలో ఓ విలేక‌రి శింబు- త్రిష పెళ్లి గురించి స్పందించమ‌ని అడ‌గ‌గా, రాజేంద‌ర్ మౌనంగా అక్క‌డి నుండి వెళ్ళి పోయాడు. దీంతో వీరి పెళ్లివార్తలు నిజమే అనట్టుగా తెలుస్తోంది. ఇక శింబు గతంలో నయనతార, హన్సిక, హర్షిక, సనాఖాన్ వంటి వారితో ప్రేమాయణాలు నడిపినట్టు చాలా వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు త్రిషతో ప్రేమాయణం పెళ్లి వరకు చేరుతుందో లేదో చూడాలి! ప్రస్తుతం కోలీవుడ్‌లో త్రిష‌- శింబు పెళ్ళికి సంబంధించిన వార్త‌లు హాట్‌ టాపిక్‌గా మారాయి.