బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు: ఎమ్మెల్సీ క‌విత

249
mlc kavitha

నేటి నుండి తెలంగాణ రాష్ర్ట పండుగ బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఆడ‌ప‌డుచులంద‌రికీ ఎమ్మెల్సీ క‌విత ఎంగిలి పూల బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌న తెలంగాణ సాంస్కృతిక వార‌స‌త్వానికి ప్ర‌తీక‌, ఆనందాల హ‌రివిల్లు బ‌తుక‌మ్మ పండుగ అని ఆమె పేర్కొన్నారు. బ‌తుక‌మ్మ పండుగ స్ఫూర్తితో, మ‌నంద‌రం ఉమ్మ‌డిగా క‌రోనాను ఎదుర్కొందాం.. సుర‌క్షితంగా, సంతోషంగా పండుగ‌ను జ‌రుపుకుందామ‌ని ఎమ్మెల్సీ క‌విత ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.