ఆ హీరో దెబ్బకు ముగ్గరు హీరోయిన్లు అవుట్ !

120
- Advertisement -

‘డీజే టిల్లు’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. ఈ బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు దెబ్బకు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కి దర్శకుడిగా కూడా సిద్దు పని చేస్తున్నాడు. తనకు హీరోగా బాక్సాపీస్‌ దగ్గర గుర్తింపు అండ్ హిట్ ఇచ్చిన విమల్ కృష్ణ ని పక్కనపెట్టి మరీ.. సిద్దూ జొన్నలగడ్డ ఈ సినిమాకి డైరెక్షన్ చేయడమే పెద్ద వివాదం అయింది. అలాంటిది, సిద్దు ఇపుడు ఒక్క డైరెక్టర్ నే కాదు, వరుసగా హీరోయిన్లను కూడా మార్చుకుంటూ పోతున్నాడని విమర్శలు వస్తున్నాయి.

‘డీజే టిల్లు’లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టిని మొదట తప్పించాడు. నేహా శెట్టి ప్లేస్ లో శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే, ఇటీవలే ఈ సీక్వెల్ నుంచి ఉన్నట్టుండి హీరోయిన్ శ్రీలీల తప్పుకుంది. శ్రీలీల తప్పుకోవడానికి ముఖ్య కారణం.. హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డనే అని రూమర్లు వినిపించాయి. డైరెక్టర్ గా సిద్దు ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు అని.. ఈ క్రమంలోనే శ్రీలీల నటన నచ్చలేదు అని, దాంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని టాక్ నడిచింది.

అయితే, శ్రీలీల తర్వాత ఆమె ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసుకున్నాడు. తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమా నుంచి సడెన్ గా తప్పుకుంది. ప్రధాన కారణం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ నే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ – సిద్దు మధ్య ఏం జరిగింది ?, ఏదో జరిగిందని అర్థం అవుతుంది. దాంతోనే ఆమె సినిమా నుంచి తప్పుకుందట. ఇప్పుడు అనుపమ ప్లేస్ లో ‘ప్రేమమ్’ బ్యూటీ మడోన్నా అనే భామను పట్టుకొచ్చారు. మరి ఈ హీరోయిన్ అయినా చివరి దాకా ఉంటుందా ?, ఊడుతుందా ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్.. అతన్ని నమ్మి రిస్క్ చేయడం అవసరమా ?

కృతి శెట్టి సంచలన నిర్ణయం.. ఇక వాటికి దూరం !

‘ఆచార్య’ అసలు విషయం చెప్పిన మణిశర్మ

- Advertisement -