జనన ధ్రవీకరణ పత్రం తప్పనిసరి…

299
- Advertisement -

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతిఒక్కరికి బర్త్‌ సర్టిఫికేట్ తప్పనిసరిగా చేస్తూ చట్ట సవరణ తీసుకురానున్నారు. ముఖ్యంగా విద్య ఉద్యోగం పాస్పోర్టు పొందేందుకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని …అందుకు చట్ట సవరణ బిల్లును ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదు చట్టం (RBD) 1969కి సవరణ చేసింది. ఆ ముసాయిదాను ప్రజల ముందు ఉంచింది.

డిసెంబర్ 7న మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని కేంద్రం రెడీ అవుతోంది. ఆమోదిస్తే.. ఇక బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం ఎవరు పుట్టినా, చనిపోయినా చట్ట ప్రకారం జనన, మరణాలను నమోదు చేస్తున్నారు. సవరణ బిల్లును ఆమోదించాక.. ఇది తప్పనిసరి అవుతుంది. జనన, మరణాల వివరాల్ని ఆస్పత్రులు, బంధువులతోపాటు.. స్థానిక రిజిస్ట్రార్‌కు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్ట సవరణతో ఓటరు కార్డు మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రం సులభంగా పొందవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా ఒక సెంట్రల్ డాటాబేస్‌ను ఉపయోగించనుంది.

జనన ధ్రువీకరణ పత్రం పొందాలంటే.. స్థానిక రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి పొందాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రంలో పుట్టిన తేదీ, ఏ ప్రదేశంలో పుట్టారో వివరాలు ఉంటాయి. ఆ సర్టిఫికెట్‌ని మీ దగ్గర భద్రంగా దాచుకోవాలి. పాన్, ఓటరు, పాస్‌పోర్టు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటి వాటితో పాటుగా తప్పనిసరిగా జనన ధ్రవీకరణ పత్రంను జత చేయనున్నారు. దీని ద్వారా భవిష్యతులో ఓటరు కార్డు పోందగోరేవారికి మరణ ధ్రువీకరణ పత్రం కోసం సులభతరమవుతుంది.

ఇవి కూడా చదవండి…

దీక్షా దివస్…చరిత్రను మలుపు తిప్పినరోజు

తెలంగాణ రక్షణ హబ్‌ :కేటీఆర్‌

నవశకానికి నాంది పలికిన రోజు:కేటీఆర్‌

- Advertisement -