శృతిహాసన్ కి ఉన్న గ్లామర్ ఫాలోయింగ్ ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి. అటు గ్లామర్ పరంగానూ, ఇటు యాక్టింగ్ పరంగా శ్రుతిహాసన్ వరుస ఆఫర్స్ ని అందుకుంటుంది. కెరీర్ ప్రారంభంలో ఐరెన్ లెగ్గా పిలిపించుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో చేసిన గబ్బర్ సింగ్ చిత్రం ఆమె జీవితానికి గొప్పమలుపు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో గోల్డెన్ లెగ్గా మారింది శృతి హాసన్
తాజాగా కాటమరాయుడు సినిమాలో కాస్త లావెక్కిందని, గ్లామర్,ఫిజిక్ రెగ్యులర్‌గా మెయింటైన్ చేసే శ్రుతి ఈ మద్య శరీరం మీద శ్రద్ద పోయిందని సిని వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నపుడు ఫిజిక్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఏదైనా సినిమాలో కొంచెం తేడాగా కనిపిస్తే చాలు ప్రేక్షకుల ఫీలింగ్ మారిపోతుంది. ఆ వెంటనే దర్శకులు నిర్మాతల ఆలోచనలు కూడా మారిపోతాయి. ఒక్కసారి ‘షేపవుట్’ అన్న ఫీలింగ్ కలిగితే ఆ హీరోయిన్ పై శీతకన్ను పడిపోతుంది. ఇలా ఇండస్ట్రీ నుంచి వేగంగా వెళ్లిపోయిన హీరోయిన్లు చాలామందే కనిపిస్తారు. ఐతే కెరీర్ ఆరంభం నుంచి చాలా ప్రొఫెషనల్ గా ఉంటూ వస్తున్న శ్రుతి హాసన్ కు ఈ విషయం తెలియందేమీ కాదు. ఆమె మొదట్నుంచి చాలా బాగా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వస్తోంది.
అయితే ‘కాటమరాయుడు’లో మాత్రం ఆమె లుక్ అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఎప్పుడూ నాజూగ్గా కనిపించే శ్రుతి ఇందులో లావైపోయి దర్శనమిచ్చింది. నడుం భాగంలో ఫ్యాట్ పెరిగిపోయి.ఆ భాగాన్ని ఎక్స్ పోజ్ చేయలేక కవర్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ముఖంలో కూడా ఆమె లావైన ఫీలింగ్ స్పష్టంగా కనిపించింది. గత ఏడాది ‘ప్రేమమ్’ సినిమాలో బాగా కనిపించిన శ్రుతి.. ‘కాటమరాయుడు’కు వచ్చేసరికి ఇలా ఎలా తయారైందో అర్థం కాలేదు. రెండు మూడు సన్నివేశాల్లో పర్వాలేదనిపించినా.. మెజారిటీ పోర్షన్లలో ఆమె తేడాగా కనిపించింది. దీనికి తోడు ఆమెకు దారుణమైన డ్రెస్సులేశారు. ఫారిన్ లొకేషన్లలో వచ్చే రెండు పాటల్లోనూ శ్రుతి కాస్టూమ్స్ చాలా తేడాగా ఉన్నాయి. అసలే శ్రుతి లావెక్కిపోయి ఉంటే.. ఆమెకు నప్పని ఎబ్బెట్టుగా ఉండే డ్రెస్సులతో పాటలు లాగించేశారు. ఈ విషయంలో ఎలాంటి ప్లానింగ్ లేనట్లుంది. ఆ సమయానికి అక్కడ ఏ డ్రెస్ దొరికితే దాన్ని వేసి హడావుడిగా పని కానిచ్చేసినట్లుగా అనిపిస్తోంది. దీంతో శ్రుతి కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ‘కాటమరాయుడు’ సినిమాలో లుక్.. కాస్టూమ్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది.