లక్స్‌పాప మళ్ళీ రెడీ అంటోంది..

142

బాలయ్యతో కలిసి చిందులేసిని హీరోయిన్ ఆశాషైని గుర్తుందా..? ప్రేమకోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఈ భామ ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.బాలకృష్ణతో కలిసి నరసింహనాయుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈబ్యూటీ. ఈ సినిమాలో చేసిన లక్స్ పాప పాట ఆశకు స్టార్ ఇమేజ్ ని  తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయటంలో ఫెయిల్ అయిన ఆశషైని.. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆశ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

 Asha Saini Reentry

అయితే అక్కడ తన అసలు పేరు ఫ్లోరాషైనిగా పాపులర్ అయింది ఈ లక్స్ పాప. ఇక త్వరలో బేగంజాన్ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాలో గుజరాత్ కు చెందిన మైనా అనే ఆదివాసి యువతి పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటి.

ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న ఆశషైనీ, బేగంజాన్ రిలీజ్ తరువాత తనకు సౌత్ నుంచి మళ్లీ పిలుపువస్తుందన్న ఆశతో ఉంది. తాను తెలుగు బాగా మాట్లాడగలనని, ఛాన్స్ ఇస్తే మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది. మరి ఆశషైనీకి ఈ సారైనా టాలీవుడ్ వెల్ కం చెబుతుందేమో చూడాలి.