బాయ్ ఫ్రెండ్ గుట్టు విప్పేసింది..

330
- Advertisement -

తెలుగు, తమిళంతోపాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకున్న విలక్షణనటుడు కమల్‌హాసన్‌. ఆయన వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి…తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. దాంతో పాటు బోల్డ్‌ గా మాట్లాడడంలో కూడా ఆరితేరిపోయింది.

ఈ అమ్మడు ఈమధ్య బోల్డ్‌ స్టేట్‌మెంట్లు బాగానే ఇస్తోంది. ఇటాలియన్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖేల్‌ కోర్సేల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శృతిహాసన్‌.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా అతడిని వెంట పెట్టుకునే వెళుతోంది.

  Shruti Haasan breaks silence on her relationship..

ఆమెకి ఇండియాలో షూటింగ్స్‌ ఉన్నప్పుడు అతను విజిట్‌ వీసాపై ఇండియాకి వచ్చేస్తున్నాడు. ఇకపోతే తన రిలేషన్‌ గురించి శృతి ఓపెన్‌గా మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. తనకో బాయ్‌ఫ్రెండ్‌ వున్నాడని మీడియా ముందు శృతి అంగీకరించడం లేదు.

అయితే ఇటీవలే ఓ సందర్బంలో శృతి మాట్లాడుతూ..ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, ఆ టైమ్‌ వచ్చినపుడు చేసుకుంటానని చెప్పిన శృతిహాసన్‌.. ఆ వెంటనే ఒకవేళ సరయిన వ్యక్తి తారసపడితే పెళ్లి కాకుండానే తల్లి అవడానికి రెడీ అని చెప్పేసింది. అంతేకాకుడా మీడియా, జనం తనగురించి ఏమనుకుంటారనే భయం లేదని పేర్కొంది.

 Shruti Haasan breaks silence on her relationship..

ఇక ఇదిలాఉంటే.. మైఖేల్‌ కోర్సేల్‌తో ఉన్న రిలేషన్‌ గురించి శృతి ఓపెన్‌ అయిపోయింది. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో శ్రుతి స్పందిస్తూ, తన వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడనని చెప్పింది. తన జీవితంలో వంద విషయాలపై ప్రేమలో ఉన్నానని… అవన్నీ తనకు అమూల్యమైనవని తెలిపింది.

ఎవరి జీవితంలోనైనా వారి జీవిత భాగస్వాములదే కీలక పాత్ర అని… కాబట్టి ఇలాంటి విషయాలను అందరితో పంచుకోవడం అర్థంలేని విషయమని చెప్పుకొచ్చింది. కానీ..సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న లవ్‌ ఎఫైర్స్‌ గురించి మాట్లాడకుండా.. అసలైన సమాధానాన్ని దాటవేసింది ఈ అమ్మడు.

- Advertisement -