జూలై 16న బిగ్‌ బాస్‌లో యంగ్‌టైగర్‌..

186
Bigg Boss with NTR to roll out from July 16th
- Advertisement -

హిందీలో సూపర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్ బుల్లి తెర షో ‘బిగ్ బాస్’‌ను సౌతిండియాలో కూడా పరిచయం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తమిళంలో కమల్ హాసన్‌తో, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో షోను నిర్వహిస్తున్నారు. తమిళంలో ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేస్తుంది. వరుస సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మరి హాలీవుడ్, బాలీవుడ్ లలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోకు టాలీవుడ్ లో జూనియర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈ షో ఎలా వుండబోతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss with NTR to roll out from July 16th

బిగ్ బాస్ షోను తెలుగులో సినీన‌టుడు జూనియ‌ర్‌ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహించ‌నున్న‌ట్లు స్టార్ మా ఛానెల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ షోను నిర్వహించేందుకు ప్రణాళికలు రచించిన స్టార్ మా ఈ రోజు మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. ఈ షోను ఈ నెల 16 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో 12 మంది సెల‌బ్రిటీలు పాల్గొన‌నున్నారు. ఈ షో నిర్వ‌హ‌ణ కోసం 60 కెమెరాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ షోకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుద‌ల చేసింది. టాలీవుడ్ అగ్ర‌న‌టుల్లో ఒక‌రిగా నిలిచిన‌ ఎన్టీఆర్‌ మొద‌టిసారి టీవీ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ షోపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయి.

- Advertisement -