ప్రేమిస్తే ..పెళ్లి చేసుకోవాలా..!

400
shruthi hassan michel
- Advertisement -

కమల్ డాటర్ శృతిహాసన్ లండన్‌కు చెందిన మైఖెల్ కోర్సేల్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి వెళ్లిన ఇద్దరు కలిసే హాజరవుతుండగా వీరి కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో మీడియా కంటపడ్డ శృతి అడిగిన ఎదురుప్రశ్నకు జర్నలిస్టులు షాక్‌ అయ్యారు. మీ పెళ్లి ఎప్పుడు అని శృతిని అడుగగా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా అంటూ బోల్డ్ స్టేమ్ మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపింది.

ఇతర మహిళలతో పోలిస్తే పెళ్లి విషయంలో తనకున్న అభిప్రాయాలు వేరని ప్రేమలో ఉంటే ఫలానా సమయంలోనే పెళ్లి చేసుకోవాలనేముంది? అని ప్రశ్నించారు. ప్రేమ అలాంటి డిమాండ్స్‌ ఎప్పుడూ చేయదు అని వెల్లడించారు.

సినీపరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకున్న శృతి బాలీవుడ్,టాలీవుడ్‌,కోలీవుడ్‌లలో పలు చిత్రాల్లో నటించింది. పవన్‌తో గబ్బర్ సింగ్,కాటమరాయుడు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఓ ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు‘హలో సాగో’ అనే తమిళ సెలబ్రిటీ టాక్‌ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -