సొమ్ము చేసుకోవ‌డంలో ఆమె క్రేజే వేరు

125
- Advertisement -

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తోంది శ్రద్ధా కపూర్. బాలీవుడ్ అంద‌గ‌త్తెల్లో శ్రద్ధా కపూర్ కి ఉన్న ప్రత్యేకత వేరు. దీనికితోడు శ్రద్ధా కపూర్ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. ఎలాగూ అందంతో పాటు అభిన‌యం కూడా ఉంది. పైగా ఆమెకున్న కోట్లాది మంది ఫాలోవ‌ర్సే.. ఆమెకు కోట్లాది రూపాయ‌లు తెచ్చి పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్న బాలీవుడ్ భామల్లో శ్రద్ధా కపూర్ ది అగ్ర‌స్థానం. ఆమెకున్న కోట్లాది మంది ఫాలోవ‌ర్సే ఆమె పెట్టుబడి.

అందుకే.. చిన్నాచితకా స్టార్టప్ కంపెనీలు ఆమెకు షేర్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధా కపూర్ కు 76.4 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆ మిలియ‌న్ల మంది అభిమాన‌మే శ్రద్ధా కపూర్ కు వ‌ద్ద‌న్నా ఆదాయం తెచ్చి పెడుతోంది. ఇక అభిమానుల అభిమానాన్ని సొమ్ము చేసుకోవ‌డం ఎలాగో శ్రద్ధా కపూర్ ను చూసి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్ పెట్టేందుకు దాదాపు రూ.కోటి తీసుకుంటోంది. అందుకే శ్రద్ధా కపూర్ ఏది పడితే అది ప్రమోట్ చేయదు.

శ్రద్ధా కపూర్ ప్రమోట్ చేయాలంటే పెద్ద ప్రాసెసే ఉంటుంది. పైగా ఆమె మెప్పు కోసం సదరు కంపెనీ పెద్దలు క్యూలో నుంచోవాలి. అసలు ఇంత‌కంటే ఒక హీరోయిన్‌కి కావాల్సిందేముంది. పైగా బోలెడంత గౌరవం. అన్నిటికి మించి శ్రద్ధా కపూర్ కి అప్ప‌నంగా ఆదాయానికి ఆదాయం, ప్ర‌చారానికి ప్ర‌చారం. పెద్దగా కష్టపడకుండానే అన్నీ వాటిక‌వే జ‌రిగి పోయి కోట్ల రూపాయిలు ఎకౌంట్ లో పడిపోతాయి. ఏది ఏమైనా శ్రద్ధా కపూర్ క్రేజే వేరు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -