బాలయ్య తర్వాతే చిరు!

123
- Advertisement -

2023 సంక్రాంతి సినిమా సమరం ఆసక్తికరంగా ఉండనుంది. ఈ సారి సంక్రాంతి రేసులో తలపడనున్నారు మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి సినిమాలు ఒకరోజు గ్యాప్‌లోనే రిలీజ్ కానున్నాయి. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న రిలీజ్ కానుండగా చిరు నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానుంది. దీంతో ఈ సారి సంక్రాంతి రేసులో ముందుగా రానున్నారు బాలయ్య బాబు.

ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మొత్తంగా సంక్రాంతి పోరు త్రిముఖంగా ఉండటంతో ఎవరు గెలుస్తారో చూడాలి.ఏదిఏమైనా సంక్రాంతి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -