రికార్డును తిరగరాసే అవకాశం…దృశ్యం-2!

163
- Advertisement -

బాలీవుడ్‌లో వరుసగా ఫ్లాప్‌ల తర్వాత సూపర్ హిట్ ఇచ్చిన దృశ్యం-2 సినిమా. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు హల్‌చల్‌ చేస్తున్న సమయంలో తొలిసారి హిందీ సినిమా కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తుంది. త్వరలోనే ఈసినిమా భారతదేశమంతటా ప్రదర్శితమయి…200కోట్ల క్లబ్‌లో ప్రవేశించబోతోంది. దీంతో ఈ సినిమా ఆల్‌టైమ్‌ అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్‌ సీక్వెల్‌ సినిమా జాబితాలో చేరిపోయింది.

మొదటి స్థానంలో సల్మాన్ నటించిన టైగర్ జిందాహై సినిమా ఉండగా…దృశ్యం-2 టాప్‌ టెన్‌లో చోటు సంపాందించుకుంది. దీంతో త్వరలో సల్మాన్ సినిమాను దాటి రికార్డు సృష్టించనుందని బాలీవుడ్‌ టాక్.  అయితే సల్మాన్‌ త్వరలో టైగర్‌-3వ సినిమాను కూడా  విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. దీంతో మరోసారి  రికార్డులను టైగర్-3   తిరగరాసే అవకాశం ఉందని బాలీవుడ్‌ క్రిటీక్స్‌ అంచనా…

లిస్టు ఇదే….

  1. టైగర్ జిందా హై (2017) -339.16కోట్లు
  2. దూమ్‌-3 (2013)- 280.25కోట్లు
  3. క్రిష్‌-3(2013)- 240.50కోట్లు
  4. హౌస్‌ఫుల్‌- 4 -(2019) 206కోట్లు
  5. గోల్‌మాల్‌ ఏగెయిన్‌ (2017)- 205.72కోట్లు
  6. భూల్‌ భూలియా-2 (2017) -185.5కోట్లు
  7. రేస్‌-3 (2018) -169కోట్లు
  8. బాఘీ-2 (2018) – 165కోట్లు
  9. దబాంగ్‌-2 (2012)- 158.50కోట్లు
  10. దృశ్యం- 2 (2022) -154.49కోట్లు

ఇవి కూడా చదవండి….

పరుగులు పెడుతున్న చిరు , బాలయ్య

విక్కీ కౌశల్‌ హీరోగా సామ్‌ బహుదూర్‌

ఇక నటించను.. కారణం అదే !

- Advertisement -