యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఈ ముగ్గురి పేర్లు తప్ప మరొకరి పేరు బయటకు రాలేదు. ఇదివరకే ‘భారీ మల్టీస్టారర్ షురూ అయింది’ అంటూ రాజమౌళి,రామారావు, రామ్‌చరణ్.. ఆంగ్ల పేర్లలో మొదటి అక్షరం ‘R’ వచ్చేలా #RRR పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియో వచ్చింది.
అయితే నవంబర్ చివరివారంలో గానీ.. డిసెంబర్ మొదటి వారంలో గాని ఈ సినిమాను లాంచ్ చేయాలనే ఆలోచనలో వున్నారని సమాచారం. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఫస్టు షెడ్యూల్లో ఎన్టీఆర్ .. ఆ తరువాత షెడ్యూల్లో చరణ్ పాల్గొంటారట.
దీనికి సంబంధించిన ప్రత్యేకమైన భారీ సెట్స్ అవసరం కావడంతో, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటి అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో మరొకటి వేస్తున్నారు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు, కథానాయికలు ఎవరనేది కూడా ప్రకటించలేదు. ఇంతవరకూ తెలుగులో ఎవరూ చేయని ఓ కొత్త కథంశంతో రాజమౌళి ఈ సినిమాను రూపోందించబోతున్నారు.