వీరభోగ వసంతరాయలు..రిలీజ్ డేట్ ఫిక్స్

204
nara rohith
- Advertisement -

నారా రోహిత్ ప్రధాన పాత్రలో ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం వీర భోగ వసంత రాయలు. హిట్ మ్యాన్‌ అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధీర్ బాబు,శ్రీవిష్ణు,శ్రియ నటిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకువస్తోంది. తాజాగా సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లందరూ కూడా విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నారు. నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ అందరిని ఆకట్టుకుంది. మెనాసింగ్ కల్ట్ లుక్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్‌లుక్‌లో నారా రోహిత్ చాల సీరియస్‌గా తన హావభావాలను కనపరుస్తూ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్‌ని కలగజేశాడు.

నటీనటులు :నారా రోహిత్, శ్రీయా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు ఇతరులు..సాంకేతిక నిపుణులు :దర్శకుడు: ఇంద్రసేన, నిర్మాత: అప్పారావ్ బెళ్ళన, బ్యానర్: బాబా క్రియేషన్స్, సంగీతం: మార్క్ కె రాబిన్, డీఓపీ: యస్‌ వెంకట్, ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి, ఎడిటర్ : శశాంక్ మాలి, యాక్షన్: రామ్ సుంకర, పబ్లిసిటీ డిజైనర్ అనిల్-భాను, పిఆర్‌ఓ: వంశీశేఖర్.

- Advertisement -