పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్‌తో విడాకుల కోసం భారీగా డబ్బులు తీసుకుందని, ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తోందని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలపై రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఒక టీవీ ఛానల్ వారు నిర్వహిస్తోన్న ‘నీతోనే డాన్స్’ అనే కార్యక్రమానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ, తనకి సంబంధించిన పుకార్లను గురించి ప్రస్తావించారు. పవన్ నుంచి విడాకులు పొందడానికి పరిహారంగా తాను భారీ మొత్తంగా డబ్బు తీసుకున్నట్టు ప్రచారం జరిగిందనీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.
ఇక ఆ డబ్బుతోనే తాను సినిమా తీశాననడం మరింత అవాస్తవమని చెప్పారు. ఈ విషయంలో తన పిల్లలు కూడా తనని అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో తాను ఈ నిజాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు.
నిజం చెప్పాలంటే, తాను గానీ .. పవన్ గాని డబ్బు మనుషులం కాదని చెప్పుకొచ్చారు. ఆర్థికపరమైన లావాదేవీలపై తనకి అవగాహన ఉందనీ, అందువలన తన కాళ్లపై తాను నిలబడగలిగానని అన్నారు.