నాగోల్‌ నాగార్జున స్కూల్‌ నిర్లక్ష్యం…విద్యార్థిని మృతి

617
Naagarjuna iit concept school
- Advertisement -

హైదరాబాద్ నాగోల్‌లోని నాగార్జున స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు మృతి చెందింది. స్కూల్‌లోని 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయింది 9వ తరగతి విద్యార్థిని వినిత. స్కూల్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. విషయాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే వినిత మృతి చెందింది.

స్కూల్‌లోని తన క్లాస్ రూమ్‌లోకి వినీత వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిందని విద్యార్థులు చెబుతుండగా ఈ భవనానికి సరైన ప్రహారగోడ లేదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే వినిత మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వినిత బంధువుల రోదనలతో స్ధానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -