జగన్ కు షాక్…50 మంది టీడీపీ లోకి?

44
- Advertisement -

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించడం కష్టంగా ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ పోలిటికల్ హీట్ మరింత పెరుగుతుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ మద్య ఎప్పుడు ఏదో ఒక రకంగా పోలిటికల్ వార్ నడుస్తూనే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ సర్కార్ కు చెక్ పెట్టాలని టీడీపీ గట్టి పట్టుదలగా ఉంది. దానికితోడు ఈసారి అధికారం చేజిక్కించుకోవడం ఆ పార్టీకి ఎంతో ముఖ్యం. ఈసారి ఏ మాత్రం తేదకొట్టిన టీడీపీలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని అధినేత చంద్రబాబు చెప్పడమే ఇందుకు కారణం,

దాంతో ఈసారి ఎలాగైనా గెలవాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అపార చాణక్యుడిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన తన చతురత కు పదును పెట్టె పనిలో ఉన్నారట. ఆ మద్య రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీకి క్రాస్ ఓటింగ్ చేసే విధంగా చంద్రబాబు వ్యూహాలు అమలు చేసి సక్సస్ అయ్యారు. దాంతో వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మేల్యేలు ఇప్పుడు టీడీపీలో చేరడం తప్పా వేరే దారి లేదనే చెప్పాలి. ఇప్పటికే అధినేత చంద్రబాబుతో ఆ నలుగురు టచ్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది.

Also Read:చావు నుంచి తప్పించుకున్న స్టార్ హీరో

ఇక వైసీపీ నుంచో మరో 50 మంది ఎమ్మేల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అధినేత చంద్రబాబు కూడా పలుమార్లు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అయితే అలాంటిదేమీ లేదని వైసీపీ కొట్టి పారేస్తోంది. దాంతో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా లేదా నిజంగానే వైసీపీ ఎమ్మేల్యేలు టీడీపీ తో టచ్ లో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు మరోసారి అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. వైసీపీ నుంచి 50 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వారు ఏక్షణంలోనైనా టీడీపీలో టీడీపీలో చేరవచ్చని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరి టీడీపీ శ్రేణులు మైండ్ గేమ్ ఆడుతున్నారా లేదా సరైన సమయంలో వైసీపీని దెబ్బ తీసేందుకు వ్యూహాలు రచిస్తున్నారా అనేది చూడాలి.

Also Read:స్వాతంత్య్రానికి ముందు తర్వాత..దేశంలో జరిగిందిదే!

- Advertisement -