రేవంత్ సర్కార్ కు చెంపపెట్టు !

20
- Advertisement -
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని.. ఇలా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పటికీ.. అదంతా తప్పుల తడిక అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో రుజువులతో సహ నిరూపించారు. అయినప్పటికి గత బి‌ఆర్‌ఎస్ పాలనపై రేవంత్ రెడ్డి సర్కార్ బురద చల్లే విధానాన్ని అవలంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డి సర్కార్ కు చెంపపెట్టు అయింది. అప్పుల విషయంలో గత బి‌ఆర్‌ఎస్ పాలనపై విషం చూమ్ముతున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ ఇస్తూ.. తెలంగాణలో అప్పుల శాతం సాధారణంగానే ఉందని తేల్చి  చెప్పింది.

అంతే కాకుండా గత ఐదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ ఒన్ గా ఉందని, ఇతర ఏ రాష్ట్రానికి సాధ్యం కానీ రీతిలో పురోగతి సాధించిందని తేల్చి చెప్పింది, దీంతో ఫోర్బ్స్ అందించిన నివేదిక కాంగ్రెస్ పాలకులకు చెంపపెట్టులా అయింది. అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి.. ఇప్పుడు వాటిని అమలు చేయాల్సి రావడంతో రాష్ట్రంలో అప్పులు పెరిగాయని, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందని.. ఇలా కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే బి‌ఆర్‌ఎస్ పాలనపై ఎన్ని విమర్శలు గుప్పించిన జాతీయ నివేధికలు మాత్రం అసలు నిజాలను బట్టబయలు చేస్తూనే ఉన్నాయి. ఫోర్బ్స్ అందించిన నివేధికను బి‌ఆర్‌ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ కాంగ్రెస్ పాలకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టింది బి‌ఆర్‌ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో గత బి‌ఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేయడం మాని, కాంగ్రెస్ అభివృద్దిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -