శివసేన మద్దతు ద్రౌపదీ ముర్మూకే : ఉద్ధవ్‌ ఠాక్రే

104
uddav
- Advertisement -

దేశ ప్రథమ పౌరుల ఎన్నికలు ఈనెల 18న జరగనున్న వేళ అభ్యుర్థులు తమ తమ మద్దతుదారులను కూడగట్టకునే పనిలో ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని శివసేన పార్టీ తమ మద్దతును ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు ప్రకటించారు. ఇందులో తనపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని కేవలం సూచనలు చేశారని చెప్పారు.

మంగళవారం జరిగిన సమావేశంలో రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ మాత్రం య‌శ్వంత్ సిన్హా వైపు మొగ్గు చూపారని స‌మాచారం. మొత్తం 18 ఎంపీలలో 14 మంది ఎంపీలు ద్రౌపదీ ముర్మూకు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆదివాసీ మూలాలున్న ద్రౌపదీ ముర్మూకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఈ స‌మావేశానికి హాజ‌రైన గిరిజ‌న ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నాయ‌క‌త్వాన్ని కోరిన‌ట్టు తెలిపారు. జులై 21న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థుతుల నేపథ్యంలో ఎన్డీయే నిలబెట్టిన ద్రౌపదీ ముర్మూకు తాము మద్దతు ఇచ్చేది కాదని … కానీ తమది అంత సంకుచిత మనస్తత్వం కాదని వ్యాఖ్యానించారు. ద్రౌపదీ ముర్మూ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వారు పైగా ఓ మహిళ కావడంతో ఆమెకు మద్దతు ఇవ్వాలని వారంతా అభిప్రాయపడినట్టు ఠాక్రే పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర జనాభాలో 10 శాతం ఆదివాసీలు ఉన్నారు.

- Advertisement -