- Advertisement -
మహరాష్ట్రలో ఈనెల21న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో పలు పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో పాల్గోన్న శివసేన ఎంపీపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శివసేన పార్టీ ఎంపీ ఓమ్రాజే నీమ్బల్కార్ ఉస్మానబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పడోలి నైగావ్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఓమ్రాజే పాల్గొన్నారు.
అయితే ఓమ్రాజే వద్దకు వచ్చిన ఓ వ్యక్తి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత ఎంపీపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎంపీ ఓమ్ రాజే చేతికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఎంపీని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఓమ్రాజే మహరాష్ట్రలోని ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
- Advertisement -