రూటు మార్చిన డైరెక్టర్లు!

13
- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ మూస కథలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరు గట్టిగానే వినిపించింది. తెలుగు డైరెక్టర్స్ రియాలిటీ కథలకు దూరంగా ఉంటారని, డిఫరెంట్ కథలను తెరకెక్కించడంలో వెనుకబడ్డారని ఇలా చాలానే విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. కానీ గత పదేళ్ల కాలంలో సీన్ మారింది. డిఫరెంట్ కథలకు, రియాలిటీ నేపథ్యనికి టాలీవుడ్ చిరునామాగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లు కొత్తరకం కథలకు ప్రదాన్యం ఇస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ కమర్షియల్ కథలతో హిట్ కొట్టే రాజమౌళి.. మగధీర, ఈగ, బాహుబలి సినిమాలతో విజువల్ వండర్స్ క్రియేట్ చేసి టాలీవుడ్ లో కొత్తదనానికి బాటలు వేశారు. ఆ తర్వాత లవ్ స్టోరీస్ ను అద్బుతంగా తెరకెక్కించే సుకుమార్ రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో టాలీవుడ్ కి రియలిస్టిక్ ఫిల్ తీసుకొచ్చారు. .

వీరిద్దరు చూపిన దారిలోనే చాలమంది డైరెక్టర్స్ డిఫరెంట్ కథలు తెరకెక్కించేందుకు ముందుకొస్తున్నారు. గతంలో ఫిల్ గుడ్ మూవీస్ తీస్తూ తనకంటూ సపరేట్ గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా ” కుబేర ” తో కంప్లీట్ గ్యాంగ్ స్టర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కింగ్ నాగార్జున, తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిస్టరీ థ్రిల్లర్స్ తెరకెక్కించే చందు మొండేటి తన నెక్స్ట్ మూవీని మత్స్య కారుల జీవిత చరిత్ర ఆధారంగా నాగ చైతన్యతో ‘ తండెల్ ‘ అనే చేస్తున్నారు.

ఈ మూవీ చందు మొండేటి స్టైల్ కు పూర్తిగా భిన్నం. ఇక హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి.. తర్వాత ప్రభాస్ తో చేయబోయే మూవీని కాంప్లిక్ యాక్షన్ మూవీగా రూపొంచబోతున్నట్లు వినికిడి. ఇక క్లాస్ కథలతో మాస్ మూవీస్ రూపొందించే కొరటాల శివ కూడా ఈసారి పూర్తి స్థాయిలో ఊర మాస్ స్టైల్ లో దేవర మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇలా చాలమంది డైరెక్టర్స్ వారి స్టైల్ కు భిన్నంగా మూవీస్ తెరకెక్కించడం టాలీవుడ్ కు శుభపరిణామం అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

Also Read:ఎన్నికల నిర్వహణపై తెలుగు సీఎస్‌ల సమావేశం

- Advertisement -