కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

9
- Advertisement -

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 17, 18వ తేదీల్లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీ ప్రముఖ పండితులు శ్రీ శంకర్ – భాగవతం ప్రాశస్త్యం, శ్రీ ఎం.నారాయణ రెడ్డి – గజేంద్రుని ఆక్రందన, డా. సుమన – మందోదరి హితబోధ, శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి – సీతా స్వయంవరం, శ్రీ శివ శంకర్ – రుక్మిణి సందేశం, శ్రీ శివారెడ్డి –ఒంటిమిట్ట రామాలయం ప్రాశస్త్యం అంశాలపై కవి సమ్మేళనం జరుగుతుంది.

అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీ శ్రీ రాంప్రసాద్ రెడ్డి – ఒంటిమిట్ట రామాలయం ప్రాశస్త్యం, శ్రీ వెంకటరమణ – హనుమత్ సందేశం, శ్రీమతి నీలవేణి – రంతి దేవుని చరిత్ర, శ్రీ వెంకటేశ్వర ఆచారి- శ్రీ రామ లక్ష్మణుల సోదర ప్రేమ, శ్రీ మధుసూదన్ – శ్రీకృష్ణ లీల, శ్రీ మల్లికార్జున రెడ్డి – జానకి సందేశం, శ్రీ నరసింహులు – రామరాజ్యం శ్రీ జగన్నాథ్ – సుందరకాండ అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు.

శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Also Read:ఎన్నికల నిర్వహణపై తెలుగు సీఎస్‌ల సమావేశం

- Advertisement -