మహాసముద్రంలో పాత్రలు ఇవే.. !

153
sharwanand
- Advertisement -

శర్వానంద్‌, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేసింది చిత్ర యూనిట్. రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. సినిమాలో ఉన్న ముఖ్యపాత్రలు అన్ని మనం ఈ వీడియోలు చూడొచ్చు. త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని యూనిట్ ప్రకటించింది. అద్భుతమైన ఈ పాత్ర ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి అని అభిమానులకు తెలిపింది. ‘ఫీల్ ది ఇంటెన్సిటీ’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు

- Advertisement -