సుమంత్ పెళ్లిపై ఆర్జీవీ మార్క్ కామెంట్స్‌..

81
rgv

హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సుమంత్‌కు విషెస్ తెలియజేస్తుండగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలీలో స్పందించారు. ఒక్కసారి అయ్యాకా కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్, నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ” అని రాసుకొచ్చారు. దీనికి ఓ ఏమోజీని జత చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారగా సుమంత్‌తో ఉన్న అనుబంధంతోనే ఆయన ఇలాంటి ట్వీట్ చేశారని పలువురు పేర్కొంటున్నారు.

నాగార్జునతో ‘శివ’ సినిమా తీసినప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీతో వర్మకు మంచి అనుబంధం ఉంది. తర్వాత ‘ప్రేమకథ’ చిత్రంతో సుమంత్‌ని హీరోగా టాలీవుడ్‌కి పరిచయం చేశారు వర్మ.

2004లో కీర్తిరెడ్డిని సుమంత్ వివాహం చేసుకున్నారు. తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరిగి 2006లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్న సుమంత్.. మళ్లీ తన మనసు మార్చుకుని వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యారు.