కొన్ని రోజులుగా యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శర్వా పెళ్ళికి సంబంధించి కొన్ని లీకులు కూడా బయటికి వచ్చేశాయి. రక్షితారెడ్డి అనే సాఫ్ట్ వేర్ ను శర్వానంద్ పెళ్లి చేసుకోనున్నారు.
రక్షిత రాజకీయ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి మనవరాలు , హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కుమార్తె. ఆమె మేనమామ గంగారెడ్డి బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి అల్లుడు. తాజాగా ఇరువురు కుటుంబాలు పెళ్లి వేడుక గురించి మాట్లాడుకున్నారు. శర్వానంద్, రక్షితారెడ్డి కుటుంబ సభ్యులు త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.
వరుస ఫ్లాపులతో కెరీర్ కొనసాగిస్తున్న శర్వా తాజాగా ఒకే ఒక జీవితం తో హిట్ అందుకున్నాడు. కమర్షియల్ గా సినిమా పెద్ద సక్సెస్ అవ్వలేదు కానీ చూసిన అందరి మన్ననలు అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే పెళ్లి పీటలెక్కనున్నాడు.
ఇవి కూడా చదవండి..