రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్నానని వస్తున్న వార్తలపై స్పందించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. వచ్చే ఎన్నికల్లో తాను రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఉండటం లేదని తేల్చిచెప్పారు. బీజేపీకి 300 మందికి పైగా ఎంపీలు ఉన్నారని, అలాంటి సమయంలో తాను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబడటం వలన ఉపయోగం ఉండబోదని, ఫలితం ఎలా ఉంటుందో తెలుసునని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ తో జరిగిన భేటీలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించిగాని, 2024 ఎన్నికలకు సంబందించిగాని చర్చకు రాలేదని అన్నారు. ఇటీవల శరద్ పవార్‌తో సహ కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా,ప్రియాంకలతో వరుసగా భేటీ అవుతున్నారు ప్రశాంత్ కిశోర్. ఈ నేపథ్యంలోనే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్ధిగా శరద్ పవార్‌ను రంగంలోకి దించుతారని వార్తలు రాగా వాటిని ఖండించారు ప్రశాంత్ కిశోర్.