బిగ్ బాస్… త్వ‌ర‌లోనే ప్రోమో

115
bigg boss

అభిమానులకు గుడ్ న్యూస్…బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ షో విజయంతంగా 4 సీజన్‌లను పూర్తి చేసుకుంది. ఇక 5వ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా వారికి శుభవార్తను అందించింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం సీజ‌న్ 5ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుండ‌గా, దీని కోసం భారీ సెట్ నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తుంది. 5వ సీజ‌న్ ఫ‌స్ట్ టీజ‌ర్ క‌ట్ వ‌చ్చే నెల‌లో బ‌య‌ట‌కు రానుందని టాక్‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది.

ఇక ఈసారి నాగార్జున స్థానంలో రానా హోస్ట్‌గా ఉంటార‌ని, కంటెస్టెంట్స్ విషయంలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సీజ‌న్‌లో స్టార్ క‌మెడీయ‌న్ అలీ కూడా పార్టిసిపేట్ చేస్తార‌ని పుకార్లు వస్తుండగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.