విపక్షాల మీటింగ్‌కు టీఆర్ఎస్ దూరం!

59
kcr
- Advertisement -

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఇవాళ జరిగే విపక్షాల మీటింగ్‌కు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్‌ ఉండే వేదికపై వెళ్లబోమని…
ఆ పార్టీతో సంప్రదింపుల సమస్యే లేదని టీఆర్ఎస్ నేతలు తేల్చి చెబుతున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం ఉండాలనేదే టీఆర్ఎస్ నిర్ణయమని అందుకే ఈ సమావేశానికి హాజరుకావడం లేదని తెలిపారు గులాబీ నేతలు. విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంకోసం ఏర్పాటుచేసిన ఈ సమావేశం నిర్వహణ పద్ధతే సరిగా లేదని …అందరికీ ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయ అభ్యర్థిపై ముందుగా చర్చించి ఒక అంగీకారానికి వచ్చి ఆ తర్వాత సమావేశాన్ని నిర్వహిస్తే బాగుంటుందని టీఆర్ఎస్ వెల్లడించింది.

రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటికే షెడ్యూలు విడుదలకాగా బుధవారం నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో తృణమూల్‌ అధినేత్రి మమత బెనర్జీ విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేయగా 18 పార్టీల నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పవార్‌ సుముఖంగా లేకపోవడంతో పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ పేరును విపక్షాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -