క్రేజీ మల్టీస్టారర్‌తో రానున్న గోపిచంద్…!

78
gopichand

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో గోపిచంద్. తాజాగా తన 30వ చిత్రాన్ని శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్‌ చేస్తుండగా పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. విభిన్నమైన జానర్‌ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో రాజశేఖర్ సైతం కీ రోల్ పోషిస్తున్నారని తెలుస్తోంది. రాజశేఖర్, గోపీచంద్ అన్నదమ్ములుగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక తర్వాత ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి చేయబోయే మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ప్రస్తుతం గోపిచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు సీటీమార్ విడుదల తేదీని త్వరలో అనౌన్స్‌ చేయనుండగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపీ. ఈ సినిమాల తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.