200 కోట్లు కొల్లగొట్టిన కబీర్‌ సింగ్‌..!

332
- Advertisement -

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌గా బాలీవుడ్‌లో క‌బీర్ సింగ్‌ పేరుతో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించారు. జూన్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చూపిస్తుంది.

kabir sing

కేవ‌లం ఇండియాలోనే ఈ చిత్రం 200 కోట్ల మార్క్ రాబ‌ట్టింది. ఇప్ప‌టికీ ఈ చిత్రం థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ క్ర‌మంలో క‌బీర్ సింగ్ ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఈ బుధవారం వరకూ ఇండియాలో ‘కబీర్ సింగ్’ రూ.206.48 కోట్లు సాధించిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీనికి ఆయన ‘కబీర్ సింగ్ 200 నాట్ అవుట్.. బాక్స్ ఆఫీస్ దగ్గర డబల్ సెంచరీ కొట్టాడు.. అయితే అలసిపోయినట్టు కనినిపించడం లేదు’ అంటూ క్రికెట్ స్టైల్‌లో క్యాప్షన్ ఇచ్చారు.

అంతే కాదు ఈ ఏడాది రూ. 200 కోట్ల మార్కును అతి త్వరగా చేరుకున్న చిత్రం ‘కబీర్ సింగ్’ అంటూ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. విక్కీ కౌశల్ ‘ఉరి’ 28 రోజుల్లో ఈ మార్కును చేరుకోగా.. సల్మాన్ ఖాన్ ‘భారత్’ కు 14 రోజులు పట్టింది. అదే ‘కబీర్ సింగ్’ 13 రోజుల్లోనే 200 కోట్ల మార్కును చేరుకోవడం గమనించాల్సిన విషయం.

- Advertisement -