అరుదైన ఘనతకి చేరువలో హైదరాబాద్ మెట్రో…

362
hyderabad metro
- Advertisement -

హైదరాబాద్ మెట్రో మరో అరుదైన ఘనతకి చేరువకానుంది. నగర ప్రజల నుంచి మెట్రోకి రోజురోజుకి అపూర్వ స్పందన వస్తోంది. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రజలు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజురోజుకి మెట్రో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

ప్రస్తుతం రోజుకు 2.85 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తుండగా ఎంజీబీఎస్​ –జేబీఎస్​ రెడీ అయితే 5 లక్షలు చేరే అవకాశం ఉంది. నవంబరు నాటికి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రోని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రెడీ చేస్తున్నారు.

కారిడార్–1లోని మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కు 29 కిలో మీటర్లు, కారిడార్-–3లోని నాగోల్ నుంచి హైటెక్ సిటీకి 27 కిలో మీటర్ల పొడవునా సేవలు అందిస్తోంది. జేబీఎస్- ఎంజీబీఎస్ రూట్​ అందుబాటులోకి వస్తే ఆ రూట్​లోనూ ఏడాది చివరి నాటికి ప్రయాణికుల సంఖ్య 5 లక్షల వరకూ చేరుకుంటుందని అంచనా.

2012 ఏప్రిల్‌ 19న ఉప్పల్‌ జెన్‌ప్యాక్ట్‌ (పిల్లర్‌ నెంబర్‌ 19) వద్ద తొలి పిల్లర్ ఏర్పాటుచేయగా నాటినుంచి 2019 మే 19 వరకు 2,599 రోజుల్లో 2,599 పిల్లర్లు నిర్మించి హైదరాబాద్ మెట్రో ప్రత్యేకతను చాటుకుంది.

- Advertisement -