థ్రిల్లింగ్‌ యాక్షన్‌తో పఠాన్‌ టీజర్‌ వచ్చేసింది

137
- Advertisement -

బీటౌన్‌ షారుఖ్‌ఖాన్‌ సినిమా వచ్చి దాదాపుగా నాలుగేళ్లు కావస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు పఠాన్‌తో రాబోతున్నాడు. ఈ సినిమా కోసం షారుఖ్‌ఖాన్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న పఠాన్‌ కోసం సరికొత్త స్టైల్‌ను రూపొందించుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్‌ మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అందులో పఠాన్‌ ఒకటి.

సిద్ధార్థ్‌ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. బుధవారం షారుఖ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ రిలీజైంది.

సీక్రెట్‌ మిషన్‌లో పట్టుపడిన షారుఖ్‌ను టెర్రరిస్టులు మూడేళ్లు టార్చర్‌ చేస్తారు. మూడేళ్ళుగా ఆయన గురించి ఎలాంటి కబురు ఉండదు. చివరికి షారుఖ్‌ చనిపోయుంటాడని ఇండియన్‌ ఇంటెలిజెన్స్ భావిస్తుంది. అలాంటి సమయంలో పఠాన్‌ బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. అసలు పఠాన్‌ మూడేళ్లు ఎక్కడ ఉన్నాడు. టెర్రరిస్ట్‌ల నుండి ఎలా తప్పించుకున్నాడు.

టెర్రరిస్ట్‌లను షారుఖ్‌ ఎలా అంతమొందించాడు అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తుంది. టీజర్‌ మొత్తం హై యాక్షన్‌ సీక్వెన్స్‌తో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. దీపికా, జాన్‌ అబ్రహం ఫైట్స్ ఆసక్తిని కలగజేస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందిన పఠాన్‌ పూర్తిగా స్పై అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా యష్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థలో 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం జనవరి 25న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. కాగా ఈ రోజు షారుఖ్‌ ఖాన్‌ బర్త్‌డే సందర్భంగా దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాను మరోసారి తెరపైకి వస్తుందని యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

బడ్జెట్ 16 కోట్లు..వసూళ్లు 300 కోట్లు!

SSMB28 లేటెస్ట్ అప్‌డేట్..

- Advertisement -