ఓటీటీలోకి గాడ్‌ ఫాదర్..

128
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరక్కిన చిత్రం గాఢ్‌ ఫాదర్. మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. నెట్‌ ఫ్లిక్స్‌లో నవంబర్ 19న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఆడియెన్స్‌కు బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక చిరు నటన సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. సత్యదేవ్ ,నయనతార, సల్మాన్ ఖాన్ నటన సినిమాకు మరో అసెట్‌గా నిలవగా తమన్ సంగీతం మరింత ప్లస్ అయింది.

మొత్తంగా ఆచార్య ఫ్లాప్‌ను గాడ్‌ ఫాదర్‌తో చెరిపేశారు చిరు. వెండితెరపై వసూళ్ల సునామీ సృష్టించిన గాడ్‌ ఫాదర్ ఓటీటీలో ఎన్ని సంచలనాలకు వేదికవుతుందో వేచిచూడాలి.

- Advertisement -