రివ్యూ : షాదీ ముబారక్

768
shadi
- Advertisement -

‘చక్రవాకం’, ‘మొగలి రేకులు’ సీరియల్స్ తో ప్రేక్షకుల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సాగర్. టీవీ నటుడిగా లభించిన ఆదరణతో ‘సిద్ధార్థ’ అనే చిత్రంలో సోలో హీరోగా మారాడు. తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో ప్రస్తుతం ‘షాదీ ముబారక్‌’తో ప్రేక్షకుల ముందుకురాగా ఈ మూవీతో సాగర్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

క‌థ‌ :-

సున్నిపెంట మాధ‌వ్‌(వీర్‌సాగ‌ర్‌) ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు పెళ్లి చూపుల కోసం వ‌స్తాడు. ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తాడు మాధ‌వ్‌. ఈ క్రమంలో ఆ మ్యారేజ్ బ్యూరోను నిర్వహించే మ‌హిళ‌(రాజ‌శ్రీనాయ‌ర్‌)కు అనారోగ్యంతో మాధ‌వ్‌ను పెళ్లి చూపుల‌కు తీసుకెళ్లే బాధ్య‌త‌ల‌ను త‌న కుమార్తె తుపాకుల స‌త్య‌భామ‌(ద‌శ్యా ర‌ఘునాథ్‌)కు అప్ప‌గిస్తుంది. ఈ ప్ర‌యాణంలో మాధ‌వ్, స‌త్య‌భామ‌ల‌కు ఒక‌రి గురించి ఒక‌రికి తెలిసే నిజాలేంటి? ఒక‌రిపై ఒక‌రు మ‌న‌సుప‌డ్డ‌ మాధ‌వ్‌, స‌త్య‌భామ ఎలా ఒక‌ట‌వుతారు? అనేదే షాదీ ముబారక్.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు, కామెడీ,కథ,కథనాలు. క‌థా ప‌రంగా డిజైన్ చేసిన త‌న పాత్ర‌లోని కామెడీతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు సాగర్. తొలి సినిమానే అయినా, న‌ట‌న‌తో చ‌క్క‌గా ఆక‌ట్టుకుంది దృశ్యా ర‌ఘునాథ్‌. హీరో స్నేహితుడిగా భద్ర‌మ్ చేసిన బంతి బాలు పాత్ర ఉండేది త‌క్కువే అయినా, హీరో సీక్రెట్స్ అంతా రివీల్ చేస్తూ కామెడీని క్రియేట్ చేయడంలో భ‌ద్ర‌మ్ పాత్ర ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. మిగితా నటీనటుల్లో బెన‌ర్జీ, హేమ‌, రామ్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, మ‌ధునంద‌న్‌, అజ‌య్ ఘోష్ అంతా ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌ :

సినిమాలోని మైనెస్ పాయింట్స్ సాంగ్స్‌, సెకండాఫ్.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ అందించిన సంగీతం బాగుంది. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ,మధు ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

అబ్బాయి, అమ్మాయి ఒకరినొక‌రు తెలుసుకోకుండా స్టార్ట్ చేసే ప్ర‌యాణంలో ఒక‌రి గురించి ఒక‌రికి తెలిసి ప్రేమ‌లో ప‌డ‌టం.. త‌ర్వాత అమ్మాయి హీరోపై కోపంతో మ‌రో పెళ్లి చేసుకోవాలనుకోవ‌డం, హీరో త‌న ప్రేమ‌ను హీరోయిన్‌కి వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం,అందులో సక్సెస్ కావడమే సినిమా కథ. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ షాదీ ముబారక్.

విడుదల తేదీ: 05/03/2021
రేటింగ్: 2.25/5
నటీన‌టులు : వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌
సంగీతం : సునీల్ క‌శ్య‌ప్‌
నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం : ప‌ద్మ‌శ్రీ

- Advertisement -