ప్చ్.. రష్మిక మందన్నాకి మరో టెన్షన్!

52
- Advertisement -

హీరోయిన్ రష్మిక మందన్నా టాలీవుడ్ లో చాలా క్రేజున్న హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే టాప్ హీరోయిన్ లలో నెంబర్ వన్ హీరోయిన్ కూడా. కానీ, ఆమెకున్న టెన్షన్లు ఆమెకు ఉన్నాయి. ప్రధానంగా రష్మిక మందన్నాకు తన విజయాల శాతం తగ్గుతోంది అన్న బాధ ఉంది. డిసెంబర్ 1వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. ఆమెకు ఇది మరో పరీక్ష. బాలీవుడ్ లో రష్మిక మందన్నాకి ఆల్రెడీ ప్లాప్ లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక చేస్తున్న భారీ సినిమా యానిమల్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ ఉంది. ఒకవేళ ఈ సినిమా ప్లాప్ అయితే, రష్మిక మందన్నా బాలీవుడ్ కెరీర్ ఇక ముగిసినట్టే అనుకోవాలి.

ప్రస్తుతానికి యానిమల్ సినిమాకి ఇప్పటివరకు భారీ హైప్ ఉంది. కానీ, తెలుగులో మాత్రం ఈ సినిమాకి ఎలాంటి హైప్ రాలేదు. తెలుగులో కూడా మేకర్స్ ప్రమోషన్ చేస్తున్నారు కానీ సరైన బజ్ రావడం లేదు. ఇక సౌత్ లో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రాబట్టడంలో రష్మిక మందన్నా కున్న పాపులారిటీనే ఉపయోగపడాలి. ఎందుకంటే హీరో రణ్ బీర్ కపూర్ కి సౌత్ లో క్రేజ్ లేదు. రష్మిక మందన్నాకి క్రేజ్ ఉంది కాబట్టే.. ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆమెను ఈ సినిమాలో తీసుకున్నారు. అందుకే, సౌత్ లో రష్మిక మందన్నానే ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ మరి.

ఒకవేళ, యానిమల్ సినిమాకు సౌత్ లో భారీ ఓపెనింగ్స్ రాకపోతే.. రష్మిక మందన్నాకి బాలీవుడ్ లో పెద్ద ఎదురు దెబ్బే. రష్మిక మందన్నా నటిగానూ మార్కులు కొట్టేసింది. ఐతే, రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లో విజయం సాధించడం ముఖ్యం. ఎందుకంటే ఆమెకు స్టార్ హీరోయిన్ గా పేరుంది. దాన్ని నిలబెట్టుకోవాలి కదా. మరి ఈ సినిమా విజయం సాధిస్తుందా? అదే ఆమెకున్న టెన్షన్. ఇంతకీ, రష్మిక మందన్నా కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read:Mangalavaram:’మంగళవారం’ ఆ లిస్ట్‌లో చేరినట్టే

- Advertisement -