కేసీఆర్ పేరుతో మొక్కను నాటుదాం- ఎంపీ సంతోష్

310
MP Santosh Kumar

ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. మంత్రి, మన యువనేత కేటిఆర్ (రామన్న).. #eachoneplantone పిలుపునందుకుని, ప్రతి వొక్కరం..‘సిఎం కెసిఆర్’ పేరుతో మొక్కను నాటుదాం.. మన అభిమాన నాయకుని మీద జీవితకాలపు గౌరవాన్ని ప్రకటించుకుందాం. సెల్ఫీ విత్… ‘‘సిఎం సర్ సాప్లింగ్’’ కార్యక్రమంలో పాల్గొందాం…భావి తరాలకు హరిత బహుమతిని అందిద్దాం. #greenindiachallenge కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేద్దామని ఎంపీ సంతోష్‌ పిలుపునిచ్చారు. #SelfieWithSaplingOnBbirthdayOfLegend పేరుతో పోస్టర్ ను ఎంపీ సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవతో కలిసి ఆవిష్కరించారు.

మానవ మనుగడకు ప్రాణం పోసేది పచ్చని చెట్టు. అటువంటి పచ్చని చెట్లను నిలువునా నరుకుతున్న మానవ నాగరిక జీవనం రోజు రోజు కూ అనాగరికంగా మారుతున్నదేమో.. మన జీవితాలను మోడువారేలా చేసుకుంటున్నమేమో.. ఎంతో కష్టపడి సంపద కూడబెడుతున్నం సరే…దాన్ని అనుభవించే మన భావితరాలకు ప్రాకృతిక జీవితాన్ని దూరం చేసి వికృత జీవితాలను అందిద్దామా..? సీరియస్ గానే ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

‘‘రేపటి తరానికి మనం కూడబెట్టాల్సింది ధన సంపద మాత్రమే కాదు…వన సంపద ’’ అనే.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆలోచనావిధానానికి అనుగుణంగా మనం వ్యవహరించాల్సిన రోజులు వచ్చినయి. మనందరిలో స్పూర్తిని నింపే దిశగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషిచేస్తన్న.. సిఎం స్పూర్తితో నీను ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మీరందరూ ఆదరిస్తుండడం నాకు ఎంతో ఆనందాన్నిస్తున్నది. పచ్చని మొక్కను పసిపాపలా సాదుకుంటున్నందుకు మీ అందరికీ నా అభినందనలు క్రుతజ్జతలు.

నిత్యం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొంటున్న మనకు..మరోసారి ఉత్సాహభరితంగా.. సెల్ఫీ విత్ సాప్లింగ్.. కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనాల్సిన శుభతరుణం వచ్చింది. మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 17న అని మనకందరికీ తెలిసిందే. అయితే ఈ శుభ సందర్భంగా మన నాయకుని మీద అభిమానాన్ని తనకు ఇష్టమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రకటించుకుందాం. మొక్కలను నాటడం వాటిని సాదడం అనేది సిఎం కెసిఆర్‌కి ఇష్టమైన సేవాకార్యక్రమం.. కాబట్టి ఫిబ్రవరి 17 తేదీన ఆ మహానాయకుని పేరున.. వొక మొక్కను నాటుదాం. వారి మీద అభిమానాన్ని గౌరవాన్ని చాటుకుందాం. సమాజ హితానికి మన వంతు తోడ్పాటునందిద్దాం.

కెసీఆర్ పేరున మొక్కను నాటుదాం..సాదుకుందాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మన జీవితకాలపు కానుకనిద్దాం..మన ప్రియతమ నాయకుని మీద ప్రేమను ప్రకటిద్దాం.. సెల్ఫీ విత్ సిఎం సర్ సాప్లింగ్… అనే నినాదాన్ని స్పూర్తిగా తీసుకోని సిఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా .. ‘‘సిఎం కెసిఆర్’’ మొక్కను నాటి…ఈ కింది ఫోన్ నెంబర్ 8790909999 కు పంపి.. కేసీఆర్ మీద అభిమానాన్ని చాటుకుంటారని ఆశిస్తున్నాను. అని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌ తెలిపారు.