షాకింగ్..ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు

64
- Advertisement -

కాబులో ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో షాహిన్ హంటర్స్‌ వర్సెస్ అబాసిన్ డిఫెండర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో షాహిన్ హంటర్స్ ఆటగాడు సెదీఖుల్లా అటల్ ఒకే ఓవర్‌లో 48 రన్స్ చేసి రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 6NB, 4W, 6, 6, 6, 6, 6, 6 పరుగులు చేసి అద్భుతం నెలకొల్పాడు. దీంతో అతడు 8 బంతుల్లోనే 48 పరుగులు చేశారు.

Also Read:దటీజ్ చిరు…’భోళా శంకర్‌’

.అటల్ (56 బంతుల్లో 108; 7 ఫోర్లు, 10 సిక్స్‌లు)సెంచరీతో రాణించాడు. అటల్ సూప‌ర్ ఇన్నింగ్స్‌తో షాహిన్ హంటర్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల చేసింది అనంత‌రం బ్యాటింగుకు దిగిన అబాసిన్ డిఫెండర్స్ 18.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. దీంతో షాహిన్ హంటర్స్ టీమ్ 92 పరుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

- Advertisement -